బాలీవుడ్ లో మరో విషాదం..క్యాన్సరుతో నటి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ లో మరో విషాదం..క్యాన్సరుతో నటి కన్నుమూత

July 13, 2020

gncfh

వరుస విషాదాలు బాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కుటుంబంతో సహా పలువురు నటీనటులు కరోనా బారిన పాడగా.. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మొదలగు నటులు కన్నుమూశారు. 

అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా నటి, మోడల్‌ దివ్య చౌక్సే క్యాన్సర్‌తో కన్నుమూశారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. దివ్య మృతికి పలువురు నటీనటులు సంతాపం తెలిపారు. దివ్య చౌక్సే పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో నటించారు.