దోపిడీ సొమ్ము.. విదేశాలకు వెళ్తానంటున్న జాక్విలిన్ - MicTv.in - Telugu News
mictv telugu

దోపిడీ సొమ్ము.. విదేశాలకు వెళ్తానంటున్న జాక్విలిన్

May 11, 2022

 

శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ పర్యవేక్షణలో ఉన్న తనకు 15 రోజుల పాటు దుబాయి పర్యటనకు అనుమతించాలని కోరారు. దాంతోపాటు ఫ్రాన్స్, నేపాల్‌లో కూడా పర్యటించాల్సి ఉందని పిటిషన్‌లో కోరారు. కాగా, దోపిడీ కేసును ఎదుర్కొంటున్న లాబీయిస్ట్ సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ గతంలో సన్నిహితంగా ఉంది. అతని నుంచి ఖరీదైన బహుమతులు తీసుకొంది. ఈ విషయాన్ని విచారణలో కూడా ఒప్పుకోవడంతో, రూ. 7.27 కోట్ల విలువైన బహుమతులను ఈడీ స్వాధీనం చేసుకొంది. అయితే ఈడీ పర్యవేక్షణలో ఉన్న వారికి విదేశీ ప్రయాణ అనుమతులుండవు. జాక్వెలిన్ గత డిసెంబరులో అనుమతి లేకుండా విదేశీ ప్రయాణానికి పయనమవుతుండగా, ముంబై ఎయిర్ పోర్టులో నిర్బంధించారు. ఈ సారి అలాంటి పొరపాటు చేయకుండా కోర్టు ద్వారా అనుమతి కోరింది. దుబాయిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డు కార్యక్రమంలో పాల్గొనడానికి జాక్వెలిన్ తాజా అనుమతి కోరింది. అయితే ఫ్రాన్స్, నేపాల్ పర్యటనలకు అనుమతి ఎందుకో ఇంకా తెలియరాలేదు.