కుటుంబంతో పిక్‌నిక్ ఎంజాయ్ చేస్తోన్న కంగనా - MicTv.in - Telugu News
mictv telugu

కుటుంబంతో పిక్‌నిక్ ఎంజాయ్ చేస్తోన్న కంగనా

July 5, 2020

Bollywood

కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు లేక చాలామంది నటీనటులు తమ కుటుంబాలతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. వారే స్వయంగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ కూడా చక్కగా తన కుటుంబంతో సరదాగా గడుపుతోంది. ఇందకు సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియాలో పంచుకుంది. తన స్వస్థలమైన మనాలీలోని అందమైన నివాసంలో కుటుంబంతో కాలక్షేపం చేస్తోంది. 

కంగనా సోదరి రంగేలి, బంధువు పృథ్వి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. మనాలీలోని అందమైన కొండ, లోయ ప్రాంతాల్లో తమకిష్టమైన వంటకాలు ఆరగిస్తూ.. కుటుంబంతో సరదాగా ఆటలు ఆడుతూ, ముచ్చటిస్తూ ఎంజాయ్ చేసింది. వారి పక్కనే పారుతున్న సేలయేరు కూడా ఆహ్లాదంగా ఉంది. ‘అందమైన లోయల్లో స్వేచ్చతో కూడిన సంతోషకరమైన క్షణాలు. ఎన్నో రకాల సమస్యలకు వైద్యం లాంటిది ప్రకృతి’ అని కంగనా స్టేటస్ పెట్టి తన పిక్నిక్‌కు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. కాగా, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు కావడం, ఆ తర్వాత మనాలీతో పాటు పలు ప్రాంతాలు గ్రీన్ జోన్లుగా మారడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది.