కొడతాననే భయంతో పెళ్లి సంబంధాలు రావట్లేదు : బాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

కొడతాననే భయంతో పెళ్లి సంబంధాలు రావట్లేదు : బాలీవుడ్ నటి

May 12, 2022

బాలీవుడ్ క్వీన్, నటి కంగనా రనౌత్ తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన క్యారెక్టర్ గురించి వదంతులు వ్యాపించడం వల్లే వివాహం చేసుకోలేకపోతున్నట్టు తెలిపారు. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘థాకడ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా రిపోర్టర్ మీరు నిజ జీవితంలోనూ టామ్ బాయ్‌గా ఉంటారా? అని అడుగగా, నవ్వుతూ ‘లేదు. నా గురించి బయట అనుకుంటున్నదంతా మీడియా క్రియేట్ చేసిందే. నేను ఎవరిని కొట్టానో చూపించండి. ఇలాంటి పుకార్ల వల్ల అబ్బాయిలను కొడతానన్న ప్రచారం జరిగింది. అందుకే నాకు పెళ్లి సంబంధాలు రావట్లేదు’ అని బదులిచ్చింది.