అంట్లు తోమిన బాలీవుడ్ బ్యూటీ - MicTv.in - Telugu News
mictv telugu

అంట్లు తోమిన బాలీవుడ్ బ్యూటీ

March 24, 2020

tgtfb

కరోనా వైరస్ మహమ్మారిని నిర్ములించడానికి ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సెల్ఫ్ క్వారంటైన్ సమయంలో సెలెబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అలాగే ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇంట్లో సింక్ దగ్గర అంట్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇంట్లో తాను ఏవిధంగా గడుపుతుందో తెలియజేస్తూ కత్రిన పలు వీడియోలను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.