కియారా మ్యాగి డ్రెస్… రెడీ కావడానికి 2నిముషాలే!
భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కియారా అద్వానీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫొటోలో కియార ధగధగ మెరిసిపోయే పసుపురంగు డ్రెస్‌లో హాట్ లుక్ కనిపిస్తోంది. డిజైనర్ అటెలీర్ జుహ్రా రూపొందించిన ఈ డ్రెస్ నారలు, నారలుగా ఉండటం, అలాగే అది పసుపు రంగులో ఉండటంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.
ఈ డ్రెస్‌లో కియారా లుక్‌ను ప్రశంసించడానికి బదులు మ్యాగీతో పోలుస్తూ కామెంట్లు చేశారు. ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం. కానీ, తిని.. తిని బోర్ కొట్టిందనుకోండి. దానితో ఇలా డ్రెస్ చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయకుండా ఇదే మంచి పద్ధతి’ అని.. ‘మసాలా మ్యాగీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్లను సరదాగా తీసుకున్న కియారా అంతే సరదాగా బదులిచ్చింది..‘హాహాహ్హా.. రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ మ్యాగీ ప్రోడక్ట్ ట్యాగ్ లైన్‌ను ట్వీట్ చేసింది.
Haha got ready in 2 minutes ????? https://t.co/pTGHvCBueI
— Kiara Advani (@Advani_Kiara) September 4, 2019