జనాల కోసం భరించడం నావల్ల కాదు - బాలీవుడ్ హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

జనాల కోసం భరించడం నావల్ల కాదు – బాలీవుడ్ హీరోయిన్

March 25, 2022

uiu

తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు కొందరుంటారు. వారిలో బాలీవుడ్ హీరోయిన్ కొంకణా సేన్ శర్మ ఒకరు. ఈమె ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తాజాగా లింగ భేదాల గురించి ఈ మె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘స్త్రీ అయినా పురుషుడు అయినా మధ్య రకంగానే ఆలోచించాలి. నేను మగాణ్ణి అనే అహంభావం పురుషులకు ఉండకూడదు. నేను ఆడదాన్ని అనే తక్కువ భావన స్త్రీకి ఉండకూడదు. అందరూ మధ్య రకంగానే ఆలోచించాలని నా భావన. అప్పుడే అందరికీ న్యాయం చేసిన వారమవుతాము. అందుకే నాకు నేను ఎప్పుడూ మహిళగా భావించుకోను’ అని వ్యాఖ్యానించింది. కాగా కొంకణాకి 12 ఏళ్ల క్రితం నటుడు రణవీర్ షోరేతో పెళ్లయింది. ఐదేళ్లు కలిసి ఉండి తర్వాత విడిపోయారు. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ మనందరం సొసైటీలో బతుకుతున్నాం. విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. కొన్ని పద్దతులు, నియమాలను తప్పనిసరిగా పాటించాలి. కానీ, నా మాజీ భర్త ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు. ఆయన ప్రవర్తన భరించలేక విడిపోయాను. జనాలు ఏమైనా అనుకుంటారేమోనని అన్నీ భరిస్తూ ఉండలేను. నాకంటూ ఓ గది, టాయిలెట్, ఏసీ వంటి సౌకర్యాలుండాలి. ప్రతీసారి ఒకరి అనుమతి తీసుకోకుండా పనిచేసుకునే వెసులుబాటు ఉండాలని కోరుకుంటా’నని బదులిచ్చింది.