అభినందన్‌, సారాల కోసం పాకిస్తానీలు తెగ వెతికారు.. - MicTv.in - Telugu News
mictv telugu

అభినందన్‌, సారాల కోసం పాకిస్తానీలు తెగ వెతికారు..

December 12, 2019

Bollywood.

మరికొన్ని రోజుల్లో 2019వ సంవత్సరం పూర్తి కానుంది. దీంతో ప్రతి ఏడాది లానే టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ సెర్చ్ ఇంజిన్ ట్రెండ్స్‌ని విడుదల చేసింది. తాజాగా పొరుగు దేశం పాక్ ప్రజలు ఈ ఏడాది ఏ విషయం గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికారని తెలిపే జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌లు టాప్‌-10లో నిలిచారు.

జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ సంచలనాన్ని సృష్టించి సంగతి తెల్సిందే. ఈ క్రమంలో అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగారు. దీంతో పాకిస్తాన్ సైనికులు ఆయన్ను బంధించారు. ఆ తర్వాత అతనిని విడుదల చేయాలా, వద్దా అన్న విషయాలపైన చాలా చర్చలు జరిపించారు. తరువాత జెనీవా ఒప్పందం ప్రకారం ఆయనను పాక్ సైన్యం విడుదల చేసింది. అలాగే బాలివుడ్‌లో ‘కేదార్‌నాథ్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా అలీఖాన్ గురించి కూడా పాక్ దేశస్తులు గూగుల్‌లో సెర్చ్ చేశారట. సారా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురు.