12 మాస్కులు పెట్టుకున్న సోనాక్షి.. - MicTv.in - Telugu News
mictv telugu

12 మాస్కులు పెట్టుకున్న సోనాక్షి..

July 15, 2020

Bollywood actress sonakshi sinha wears 12 masks

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లకు, మాస్కులకు డిమాండ్ పెరిగింది. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఒకదాని తర్వాత మరొక మాస్కు ధరించింది. పలు రకాల మాస్కులను పెట్టుకుని ‘న్యూ మాస్క్ హూ దిస్’ అని పేర్కొంటూ ఆమె ఈ వీడియోలన్నింటినీ ఒక్కదానిలో కలిపి షేర్ చేసింది. 

ఆమె 12 రకాల రంగురంగుల మాస్కులను  ధరించడం గమనార్హం. ఈ మాస్కులన్నీ ధరిస్తోన్న సమయంలో బ్యాక్ డ్రాప్ లో కరోనా వైరస్ మాస్క్ ఆన్ పాటను యాడ్ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని ఆమె కోరింది. ‘మాస్క్ ఆన్.. కరోనా ఆఫ్’ అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.