దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా విమానాలు గాల్లోకి ఎగరడం లేదు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి సన్ని లియోన్ తన భర్త డేనియర్ వెబర్, పిల్లలు నిషా, నోవా, అషర్‌లతో కలిసి అమెరికాకు చెక్కేసింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్‌లోని తన ఇంట్లో ఉంది. పిల్లల రక్షణ కోసం అమెరికా వచ్చినట్టు సన్నీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది.
దీంతో ఇన్ని రోజులు ముంబైలో ఉన్న సన్ని.. సడెన్ గా అమెరికా ఎలా వెళ్లిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సన్ని లియోన్ దేశం విడిచి వెళ్లిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం కన్నుగప్పి ఆమె దేశం విడిచి వెళ్లిఉంటుందని కొందరు అంటున్నారు. అయితే, ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. దీంతో ఇటీవల కొందరు అమెరికా పౌరులు భారత్ నుంచి స్వదేశానికి వెళ్లారు. వాళ్లతో పాటు సన్నీ కూడా వెళ్లి ఉండవచ్చునని కొందరు అంటున్నారు. ఈ అంశమై స్పష్ట రావాల్సి ఉంది.