మూడు సార్లు నన్ను పెళ్లి నుంచి కాపాడాడు : బాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

మూడు సార్లు నన్ను పెళ్లి నుంచి కాపాడాడు : బాలీవుడ్ నటి

July 1, 2022

మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. అందరూ తాను దత్తత తీసుకున్న ఇద్దరు ఆడపిల్లలు కారణమని అంటూంటారని, కానీ, అది నిజం కాదని ఆమె తెలిపింది. తన జీవితంలో ఎవరు వచ్చినా ఆహ్వానించడానికి వారు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ‘నేను ఇప్పటివరకు మూడు సార్లు పెళ్లి వరకు వచ్చాను. అన్నిసార్లు కూడా నేను పెళ్లి చేసుకోకుండా ఆ దేవుడే కాపాడాడు. నా ఇద్దరు ఆడపిల్లలను చూసి నేను గజిబిజి బంధంలో చిక్కుకోకూడదని దేవుడు అనుకుంటున్నాడు. అలాఅని ఎవరైనా వచ్చి నా బాధ్యతలను నెత్తిన వేసుకోవాలని కోరుకోవడం లేదు. కానీ, దత్త పుత్రికల నుంచి నన్ను దూరంగా జరగమని అడగొద్దు. అదృష్టవశాత్తూ నా జీవితంలో ఓ మంచి వ్యక్తిని కలిశాను. అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే అతను నన్ను నిరుత్సాహపరిచాడు. దానికీ నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు’ అని అభిప్రాయపడింది. కాగా, సుస్మిత ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ రోమన్ షాల్‌కు బ్రేకప్ చెప్పింది.