గణేష్ దర్శనానికి వెళ్లొచ్చే లోపు హీరోయిన్ చెప్పులు మాయం - MicTv.in - Telugu News
mictv telugu

గణేష్ దర్శనానికి వెళ్లొచ్చే లోపు హీరోయిన్ చెప్పులు మాయం

September 12, 2019

చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే సామెత వినే ఉంటారు. దైవ దర్శనాలకు వెళ్లినప్పుడు దేవాలయాల బయట చెప్పులు వదిలి వెళ్ళితే.. అవి ఎక్కడ పోతాయో అనే భయం ఉండడం సహజం. ఇలాంటి సంఘటనే  బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ విషయంలో జరిగింది. 

ఆమె దైవ ద‌ర్శ‌నం పూర్తి చేసుకొని వచ్చి చూసే స‌రికి ఆమె చెప్పులు మాయం అయ్యాయి. గ‌ణేష్ ఉత్సవాల్లో భాగంగా ఆమె తాజాగా ముంబైలోని ప్రముఖ దేవాలయం లాల్‌బాగ్చా రాజా దర్శనానికి వెళ్లారు. వినాయక దర్శనం చేసుకుని తిరిగి వచ్చి చూస్తే, తాను వేసుకొచ్చిన కోల్హాపూర్ చెప్పులు మాయ‌మ‌య్యాయి. దీంతో చెప్పులు లేకుండానే కారు వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లారు. ఈ విష‌యాన్ని స్వ‌ర భాస్క‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఓ వీడియోను జోడించారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.