Bollywood celebrities most trusted fitness hacks
mictv telugu

ఈ సెలబ్రిటీలు ఏం తింటారు.. ఏం తాగుతారు!

November 17, 2022

సెలబ్రిటీలు జిమ్‌లో వర్కవుట్లు చేస్తారని తెలుసు. కానీ అవికాకుం ఏం తింటారు? ఏం తాగుతారని తెలుసుకోవాలని ప్రతీ అభిమానికి ఉంటుంది. బిజీ షెడ్యూల్లో కూడా అంతలా ఎలా మెయింటెన్ చేస్తారనే సందేహం కూడా రాకమానదు. కొన్ని సంవత్సరాలుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్ల పై ఓ లుక్కేయండి..

మలైకా అరోరా


బాలీవుడ్ సెలబ్రెటీల్లో పెద్ద ఫిట్నెస్ రాక్షసి అంటే మలైకా అనే చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా అదే ఫిగర్ మెయింటెన్ చేస్తూ కుర్రవాళ్ల గుండెలను సైతం కట్టిపడేసే అందం ఆమెది. మరి ఎలా ఇలా మెయింటెన్ చేస్తూనే సందేహం అందరికీ వచ్చింది. దానికి ఈ మధ్యే ఆమె సమాధానం ఇచ్చింది. ‘నేను రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగుతాను. దీనివల్ల లోపల ఉన్నటాక్సిన్స్ పోయి, జీర్ణవ్యవస్థ కూడా సరిగా పనిచేస్తుంది. ఇదే ఆరోగ్య రహస్యం’ అని చెప్పుకొచ్చింది మలైకా.

ఆలియాభట్


ఆలియా.. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్నివుడ్ల కలల రాకూమారి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూతురికి జన్మనిచ్చి కాస్త బ్రేక్ తీసుకుంటుందేమో! కానీ మళ్లీ ఫిట్‌గా తయారవడానికి మాత్రం వర్కవుట్లు చేస్తుంది. వాటితో పాటు డైట్ కూడా మెయింటెన్ చేస్తుంది. కొంతకాలం క్రితం తన ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆలియా చెప్పిందేమిటంటే.. రోజులో మూడుసార్లు ప్రొటీన్‌ని తీసుకుంటుందట. అలాగే రెండు వారాలకొకసారి చీటింగ్ డే అని పెట్టుకొని నచ్చినవన్ని తినేస్తుందట. అలోవెరా జ్యూస్, గ్రీన్ టీ శరీరంలోని వ్యర్థాలను తీసేస్తుందని నమ్ముతుంది. బాదం, డార్క్ చాక్లెట్ డైట్లో ఉండేలా జాగ్రత్తపడుతుందట ఆలియా.

హృతిక్‌రోషన్


పది వారాల్లో పది కేజీలు తగ్గిన ఘనత హృతిక్రోషన్ది. స్పోర్ట్స్ థెరిపిస్ట్, యోగా మాస్టర్ల వల్లే ఇది సాధ్యమైందని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు హృతిక్. రోజూ క్రాస్‌ఫిట్, వెయిట్ ట్రెయినింగ్లు తప్పక చేస్తాడట. వీటితో పాటు డైట్ కూడా ముఖ్యమంటున్నాడీ కండల వీరుడు. రోజుకి 100 గ్రాముల మాంసం తింటాడట. బ్రొకలీ, ఆకుకూరలు, మొలకలను ఒక కప్పు అన్నంతో తీసుకుంటాడు. ప్రొటీన్ పౌడర్, కోడిగుడ్డులోని తెల్లసొన తప్పక తన డైట్లో ఉంటుందంటున్నాడీ హీరో.

అక్షయ్‌కుమార్


మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యుడు అక్షయ్. ఫిట్‌గా ఉండాలంటే కచ్చితంగా ఫంక్షనల్ ట్రెయినింగ్ అవసరం అంటున్నాడు బాలీవుడ్ స్టార్. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా రెగ్యులర్‌గా వ్యాయామం తప్పనిసరి. రాత్రి 7 గంటలలోపు తన డిన్నర్‌ని పూర్తి చేస్తాడట. అలా చేస్తే తిన్నది ఒంటికి పడుతుంది. పైగా జీర్ణవ్యవస్థ కూడా సరిగా పనిచేస్తుందంటున్నాడు అక్షయ్.

శిల్పాశెట్టి


రోజు కనీసం పది నిమిషాలు మెడిటేషన్ చేస్తుంది శిల్ప. కార్డియో, యోగా తన రోజువారీ కార్యక్రమంలో భాగం అంటుందీ పొడుగుకాళ్ల సుందరి. అమ్మలందరూ కూడా కచ్చితంగా మెడిటేషన్ చేయాలని ఈ సుందరి సలహాలు ఇస్తుంది. కచ్చితంగా వారంలో ఐదు రోజులు పాటించి తీరాలంట. అంతేకాదు.. ఉదయం వేడి నీటితో తన రోజును ప్రారంభిస్తుంది. ఇవికాకుండా మొలకలు, ఫ్రెష్ ఫ్రూట్స్ తన ఫిట్నెస్కి కారణమంటున్నదీ అమ్మడు.