కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్... సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్… సంచలన వ్యాఖ్యలు

April 24, 2018

కాస్టింగ్ కౌచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నుంచి మొదలై బాలీవుడ్, టాలీవుడ్‌ల వరకు వచ్చింది. శ్రీరెడ్డి ఈ విషయంలో చాలా దూరం వరకు వెళ్లిందనే చెప్పొచ్చు. కాగా కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో రక్షణగా వుంటుంది. ఒంటరిగా ఇండస్ర్టీకి వెళ్ళే అమ్మాయిలకు ఈ వంకతో కొందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి అని పేర్కొంది.మీడియాతో మాట్లాడుతూ.. ‘ బాబా ఆదమ్ కాలం నుంచే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది వుంది. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. ప్రతి అమ్మాయి మీద ఎవడో ఒకడు చేయి వేయాలనే చూస్తాడు.

ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం లేదా ? ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ వుంది. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలోనే వుందనటం సరికాదు. ఇండస్ట్రీ అమ్మాయిలను రేప్ చేసి రోడ్డు మీద వదిలెయ్యటం లేదు. అందుకు ప్రతిఫలంగా ఫుడ్డు పెడుతోంది. నాకో విషయం అర్థం కాక అడుగుతాను.. మీ దగ్గర టాలెంట్ వుంటే తమని తాము ఎందుకు అమ్ముకుంటారు చెప్పండి ? ’ అని ప్రశ్నించారు. సరోజ్ ఖాన్ రైటర్‌గా, కొరియోగ్రఫర్‌గా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. 1983లో తన కెరియర్ ప్రారంభింన ఆమె అనేక సినిమాలకు రైటర్‌గా, కొరియోగ్రఫర్‌గా పనిచేశారు. తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.