‘రాజమౌళిని జైల్లో పెట్టాలి’.. బాలీవుడ్ విమర్శకుడి అక్కసు - MicTv.in - Telugu News
mictv telugu

‘రాజమౌళిని జైల్లో పెట్టాలి’.. బాలీవుడ్ విమర్శకుడి అక్కసు

March 25, 2022

jjjj

ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అంటూ భాష, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారు. అనేక మంది సినీ విమర్శకులు సైతం దేశం గర్వించదగ్గ సినిమా తీశారని రాజమౌళిని మెచ్చుకుంటున్నారు. అయితే, పాన్ ఇండియా సినిమాలతో రోజురోజుకూ రాజమౌళి, టాలీవుడ్ రేంజ్ పెరుగుతూ ఉండడంతో తట్టుకోలేని వాళ్లు కొందరు ఉంటారు. సౌత్ సినిమా ప్రపంచ స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుండడంతో, ఎలాగైనా తొక్కాలని వారు పనిగట్టుకొని ఎదురుచూస్తుంటారు. బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఖాన్ ఈ కోవలోకే వస్తాడు. ఆర్ఆర్ఆర్‌ను ఇప్పటివరకు వచ్చిన అత్యంత చెత్త సినిమా అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూసి నాకు ఉన్న మతిపోయిందని, దేశంలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా అంటూ తన కుళ్లు బుద్దిని బయటపెట్టాడు. ఆర్జీవీ తీసిన డిజాస్టర్ మూవీ షోలేకు రీమేక్‌గా వచ్చిన ‘ఆగ్’ లాగా, రాజమౌళికి ఈ సినిమా అంటూ దారుణంగా విమర్శించాడు. బతికున్న మనిషిని చచ్చేలా చేస్తున్న ఈ సినిమాకు నేను 0 రేటింగ్ ఇస్తున్నానంటూ రాసుకొచ్చాడు. రూ. 600 కోట్లతో ఇలాంటి చెత్త సినిమా తీసి జనాల మెదళ్లను పాడు చేసిన రాజమౌళిని ఆరు నెలలు జైల్లో పెట్టాలని డిమాండ్ చేశాడు. దీనికి కొందరు నెటిజన్లు, అభిమానులు స్పందిస్తూ.. ఎవరెంత గింజుకున్నా, ఈ సినిమా రికార్డు స్థాయిలో హిట్ కొడుతుందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. మీరెంత ఏడ్చినా తెలుగు సినిమా స్థాయిని దిగజార్చలేరని, సినిమా సినిమాకు ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ కమల్ ఖాన్ అనే వ్యక్తి గతంలో బాహుబలి సినిమాకు కూడా ఇలానే రివ్యూలు ఇచ్చాడు. ఒకవైపు దేశం మొత్తం ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టగా, ఈయనకొక్కడికే నచ్చలేదంటే తేడా ఎవరో తెలుసుకోవడం ప్రేక్షకులకి పెద్ద కష్టం కాదు.