మిడిల్ క్లాస్ మాస్టర్ డైరెక్టర్ బసు ఛటర్జీ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

మిడిల్ క్లాస్ మాస్టర్ డైరెక్టర్ బసు ఛటర్జీ కన్నుమూత

June 4, 2020

 

Basu Chatterjee.

బాలీవుడ్ చిత్ర చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏప్రిల్‌ నెలలో దిగ్గ‌జ న‌టులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ క‌పూర్ మృతి చెందిన విషయం విదితమే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బసు ఛటర్జీ(90) ఈరోజు అనారోగ్యంతో ముంబైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 

కార్టూనిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన బ‌సు తరువాత క్రమంగా దర్శకుడిగా మారారు. 1969లో వ‌చ్చిన ‘సారా ఆకాశ్’ బసు మొదటి సినిమా. త‌క్కువ కాలంలోనే ‘బాల్క‌నీ క్లాస్ డైరెక్ట‌ర్‌’గా పేరు గ‌డించారు. ‘ర‌జ‌నీగంధ’‌, ‘బాతో బాతో మే’, ‘ఏక్ రుకా హువా ఫైస్లా’, ‘చిచోర్’‌, ‘పియా కా ఘ‌ర్’‌, ‘చోటీ సి బాత్’, ‘స్వామి’ వంటి ఎన్నో గొప్ప హిందీ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని అంటారు. 1992లో బసు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు. “అత‌ను ప‌ని చేసిన‌ సినిమాల్లో ప్ర‌తిభ‌తో పాటు సున్నిత‌త్వం కూడా ఉంటుంది. ఇది ప్రజ‌ల‌ మ‌న‌సుల‌ను తాకుతుంది. ఆయ‌న సినిమాలు అన్ని ర‌కాల భావోద్వేగాల‌తో పాటు ప్ర‌జ‌ల పోరాటాలను ప్ర‌తిబింబిస్తాయి. అత‌ని కుటుంబానికి, అభిమానుల‌ను నా ప్ర‌గాఢ సానుభూతి” అని ట్వీట్ లో పేర్కొన్నారు.