Bollywood Filmmaker Kamal Mishra Caught With Girlfriend To His Wife
mictv telugu

కారులో గర్ల్ ఫ్రెండ్ తో సరసాలు.. భార్యకి అడ్డంగా దొరికిన ప్రముఖ నిర్మాత.. కారుతో తొక్కి చంపే ప్రయత్నం

October 27, 2022

Bollywood Filmmaker Kamal Mishra Caught With Girlfriend To His Wife

బాలీవుడ్ లో లేటెస్ట్ గా ఒక ఎఫైర్ వెలుగులోకి వచ్చింది. హిందీలో మంచి నిర్మాతగా పేరున్న కమల్ కిషోర్ తన భార్యకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుడుపోయాడు. ప్రియురాలితో కారులో సరసాల్లో మునిగి తేలుతుండగా.. భార్య సడెర్న్ఎంట్రీ ఇచ్చింది. దాంతో అడ్డంగా దొరికిపోవటంతో భార్యనుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు కిషోర్ మిశ్రా. ఈ తతంగమంతా సీసీ టీవీలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో బార్యపైకి కారు ఎక్కించిన కమల్ కిషోర్ మిశ్రా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అక్టోబర్ 19న సబర్బన్ అంధేరి లోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఉదంతంలో కమల్ మిశ్రా భార్య గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.

అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, నిర్మాత కమల్ కిషోర్ పై భార్య ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమల్ మిశ్రా ఇంట్లో కనిపించకపోవటంతో.. తన భర్త కోసం వెతుకుతున్నప్పుడు పార్కింగ్ ప్రాంతంలో కారులో మరో మహిళతో కలిసి కనిపించాడని.. అప్పుడు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రశ్నించే సమయంలో కమల్ మిశ్రా అక్కడి నుండి తప్పించుకోవడానికి తన కారుని స్టార్ట్ చేసి తనపైకి ఎక్కించాడని.. దాంతో కారు ఢీ కొని తానూ కింద పడినా కూడా పట్టించుకోకుండా కాళ్ల మీద నుంచి కారుని పోనిచ్చాడని.. అయితే దగ్గరలోని మరో వ్యక్తి వచ్చి తనని బయటకు లాగి కాపాడాడని.. ఈ ఘటనలో తన కాళ్ళు, చేతులు, తలపై గాయాలు అయ్యాయని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్టు అధికారి తెలిపారు. ఇక తన భర్త తనను కారుతో తొక్కించి చంపడానికి ప్రయత్నించాడని ఆమె అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.