ఈగ సినిమా విలన్, కన్నడ హీరో సుదీప్‌కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. వివరాలు.. ఇటీవల సుదీప్ ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ.. ‘మన సినిమాలు హిందీలో చాలా బాగా ఆడుతున్నాయి. మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలను నిర్మిస్తున్నాం. బాలీవుడ్ వాళ్లు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్ చేస్తూ సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను రూపొందించే హిందీ భాష ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదు’ అని వ్యాఖ్యానించారు.
దీనికి బాలీవుడ్ నటుడు రిప్లై ఇస్తూ..‘సోదరా, హిందీ జాతీయ భాష కాకపోతే మీ కన్నడ చిత్రాలను ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హిందీ ఎప్పటికీ జాతీయ భాషగా ఉంది, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది’ అంటూ బదులిచ్చారు. మరి దీనికి సుదీప్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022