Bollywood hero ranveer singh nude photoshoot
mictv telugu

బాలీవుడ్ హీరో నగ్న ఫోటోషూట్.. మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

July 22, 2022

Bollywood hero ranveer singh nude photoshoot

బాలీవుడ్ స్టార్ హీరో, నటి దీపికా పదుకొణే భర్త రణవీర్ సింగ్ చేసిన పని ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా పూర్తి నగ్నంగా కాస్మొపాలిటన్ మ్యాగజైన్‌కు ఫోజులిచ్చాడు. ఇప్పటివరకు రణవీర్ అనేక రకాల డ్రెస్సులతో నిత్యం వార్తల్లో ఉన్నా, ఈ సారి మాత్రం మీమర్స్ తెగ ఆడేసుకుంటున్నారు.

1972లో ఇలా ఫోజులిచ్చిన పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్ట్స్‌కి నివాళిగా చేసిన ఈ ఫోటో షూట్ చూసి నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. అంతేకాక, నీ భార్య దీపికా చూస్తే నిన్ను ఇలా కొడుతుందంటూ మీమ్స్ చేస్తున్నారు.