బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పరిణీతి చోప్రా సముద్రంలో చెత్తను శుభ్రం చేస్తుంది. స్కూబా డ్రైవర్ సర్టిఫికెట్ ఉండడంతో ఆమె ఈ పనికి పూనుకుంది. సముద్రం అడుగు భాగంలో చెత్తను ఏరుతున్న దృష్యాలను వీడియో తీసి తన ఇన్స్టాగ్రాంలో శనివారం పోస్ట్ చేసింది. దాంతో పాటు సముద్రంలో చెత్త పేరుకుపోవడం వల్ల తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగళాలలకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంది. ప్రతీ సంవత్సరం సముద్రంలో 14 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోతోందని, 2050 వచ్చేసరికి ఇది నాలుగు రెట్లు పెరుగుతుందని హెచ్చరించింది. ఇప్పటివరకు 90 వేల మంది కలిసి 2 మిలియన్ టన్నుల చెత్తను ఏరామని వెల్లడించింది. ఇంత పెద్ద ప్రోగ్రాంలో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని అభిప్రాయపడింది. ఈ వీడియోను చూసిన అభిమానులు, పర్యావరణ వేత్తలు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. కాగా, 2011లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పరిణీతి.. అనుపమ్ ఖేర్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీలతో కలిసి నటించిన తాజా చిత్రం ఉంచాయ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
View this post on Instagram