చిన్నారి డాన్స్.. అమితాబ్ బచ్చన్ ఫిదా (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి డాన్స్.. అమితాబ్ బచ్చన్ ఫిదా (వీడియో)

October 21, 2020

bollywood megastar Amitabh Bachchan is bowled over by little girl dancing.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అమితాబ్ బచ్చన్ ఓ చిన్న పాప డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న చిన్న పాప హర్యానా జానపద పాటకు డాన్స్ చేస్తోంది. 

 

 

View this post on Instagram

 

Untrained talent .. simply astounding ?? !! Jutti nikal gai but the show must go on .. !! ???

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

డాన్స్ చేస్తున్న సమయంలో తన చున్నీ పడిపోయినా, చెప్పు ఊడిపోయినా ఆమె ఆగకుండా డాన్స్ చేసింది. ఏకాగ్రతను కోల్పోకుండా ఆమె డాన్స్ చేయడంతో అమితాబ్ బచ్చన్ ఫిదా అయ్యారు. ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాగే ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ రూపొందిస్తున సినిమాలో కూడా అమితాబ్ నటిస్తున్నారు.