అమీర్‌పేటలో ‘స్పెషల్ 26' సినిమా సీన్...సీబీఐ అధికారులమంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

అమీర్‌పేటలో ‘స్పెషల్ 26′ సినిమా సీన్…సీబీఐ అధికారులమంటూ..

September 24, 2019

ameerpet.....

బాలీవుడ్‌లో విడుదలైన ‘స్పెషల్ 26’ హిందీ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ నకిలీ సీబీఐ అధికారిగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ తన నకిలీ సీబీఐ బృందంతో పలువురు అధికారులు, వ్యాపారుల ఇళ్లపై దాడులు చేస్తూ దోచుకుంటూ ఉంటాడు. ఈ సినిమా సీన్ ఓ వ్యాపారి విషయంలో నిజం అయ్యింది. 

హైదరాబాద్ అమీర్‌పేటలో ఉండే ఓ జ్యోతిష్యుడ్ని కొందరు సీబీఐ అధికారులమంటూ మోసం చేశారు. అన్నపూర్ణ బ్లాక్‌లోని 5వ అంతస్తులో ఉంటున్న జగదీష్ అనే జ్యోతిష్యుడి ఆఫీస్‌లోకి సీబీఐ అధికారులము అంటూ ఆరుగురు దుండగులు ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు చేశారు. జగదీష్ దగ్గర ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.