పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు వేలకోట్లకు టోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దావా వేసింది. నీరవ్‌కు చెందిన డైమండ్ బ్రాండ్‌కు ప్రియాంక బ్రాండ్ అబాసిండర్గా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలల క్రితం ప్రియాంక, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి ప్రకటనల్లోనూ నటించారు.ప్రియాంక ప్రకటనల్లో నటించిందుకు గాను తనకు పారితోషికం ఎగ్గొట్టాడని నీరవ్‌పై ప్రియాంక దావా వేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. నీరవ్.. సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా బాకీ పడ్డాడు. జనవరిలో నీరవ్ డైమండ్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ సందర్బంగా ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ… ‘నీరవ్‌తో కలిసి పని చేస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఆయన డిజైన్ చేసే వజ్రాభరణాలు ఆద్భుతంగా ఉంటాయి. అందుకే వీటిని మార్కెట్లో విక్రయించాలనుకుంటున్నాం’ అని తెలిపింది. నీరవ్ అవినీతి బయటపడంతో స్నేహితులు,పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతనితో మాట్లాడం మానేసినట్టు సమాచారం.