బాలీవుడ్‌లో మ‌రో క‌రోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో మ‌రో క‌రోనా పాజిటివ్

April 6, 2020

bollywood producer Karim Morani's daughter Shaza tests positive for coronavirus

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడి బ‌య‌ట‌ప‌డిన సంగతి తెల్సిందే. ఇంత‌లోనే మరో బాలీవుడ్ సెలబ్రిటీ కొరోనావిర్స్ బారిన పడింది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, రావ‌న్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత, నాటుడు షారుఖ్ ఖాన్ ఆప్త‌ మిత్రుడు క‌రీం మొరానీ కూతురు షాజా జ‌రానీ క‌రోనా పాజిటివ్ అని తేలింది. 

ప్ర‌స్తుతం ఆమె ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నది. కూతురికి కరోనా పాజిటివ్ రావడంతో క‌రీం కుటుంబం ప‌ద్నాలుగు రోజుల‌పాటు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంది. అత‌డి ఇంట్లో నివ‌సించే తొమ్మిది మంది సభ్యులు మంగ‌ళ‌వారం కరోనా ప‌రీక్ష‌లు చేయించుకోనున్నారు. షాజా జ‌రానీ ‘ఆల్వేస్ క‌బీ క‌బీ’, ‘హ్యాపీ న్యూ ఇయ‌ర్’ చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసింది.