మీ మేకప్ మీరే వేసుకోవాలి, నో హగ్స్, నో కిస్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ మేకప్ మీరే వేసుకోవాలి, నో హగ్స్, నో కిస్

June 2, 2020

meekap

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతోన్న సంగతి తెల్సిందే. అయినా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ సినిమా షూటింగ్ లకు అనుమతిచింది. అయితే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం… నటీనటులు ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి. 

షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో నటీనటులు, సిబ్బంది భౌతికదూరం పాటించాలి.  సెట్స్ లో హగ్ చేసుకోవడాలు,  ఫైట్లు, కిస్సింగ్ సన్నివేశాలు చిత్రీకరించకూడదు. అలాగే పెళ్లి సన్నివేశాలు, మార్కెట్ సన్నివేశాలకు కూడా అనుమతి లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వడం, సిగరెట్లు షేర్ చేసుకోకూడదు. స్టూడియోలోకి కానీ, సెట్స్ పైకి కానీ రాగానే శానిటైజేషన్ తప్పనిసరి. ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక సెట్ పై 50 మంది కంటే ఎక్కువ మందికి అనుమతిలేదు.