అది నా సినిమాను తొక్కేసింది : బాలీవుడ్ స్టార్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

అది నా సినిమాను తొక్కేసింది : బాలీవుడ్ స్టార్ హీరో

March 26, 2022

బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. చరిత్రలో దాగున్న ఓ నిజాన్ని నిర్భయంగా బయట పెట్టారంటూ దర్శకుడిని అభినందించారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యులు చేశారు. బాక్సాఫీసు కలెక్షన్లను ప్రస్తావిస్తూ.. ఈ సినిమా ఓ సంచలనంగా మారిందని అభిప్రాయపడ్డారు. దేశ విదేశాల్లోనూ ఈ సినిమా ఊహకందని రీతిలో సక్సెస్ అయిందని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఈ సినిమా వల్ల తన తాజా సినిమా ‘బచ్చన్ పాండే’కు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైందని ఛమత్కరించారు. కశ్మీర్ ఫైల్స్ మాయలో పడి చాలా మంది ప్రేక్షకులు తన సినిమాను మర్చిపోయారని వెల్లడించారు. దానికి ఉదాహరణగా ఆ సినిమాకు వస్తున్న వసూళ్లేనని పేర్కొన్నారు. కాగా, తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా బచ్చన్ పాండే వచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్‌గా రూపొందింది.