బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఇంట్లో దొంగలు..కేసు నమోదు చేసిన పోలీసులు.!! - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఇంట్లో దొంగలు..కేసు నమోదు చేసిన పోలీసులు.!!

March 3, 2023

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మన్నత్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇద్దరు కుర్రాళ్లు గురువారం సాయంత్రం షారుఖ్ ఇంట్లోకి చొరబడ్డారు. మూడో అంతస్తులోకి వెళ్లిన వీరిని భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే స్పందించారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరు కుర్రాళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వీరిని గుజరాత్ కు చెందినవారుగా గుర్తించారు. షారూఖ్ ఖాన్ కలిసేందుకు తాము మన్నత్ కు వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకులు ఇంట్లోకి చొరబడినప్పుడు షారుఖ్ ఖాన్ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. షారూఖ్ ఖాన్ బంద్రాలోని మన్నత్ ఇల్లు దాదాపు 2700స్వైర్ ఫీట్ విస్తీర్ణంలో ఉంంది. దీని విలువ 200కోట్లు ఉంటుంది.