రెండో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్

March 11, 2022

 

hhhh

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి తెలియని వారుండరు. ఆయన నటించిన సినిమాలు హీందీతోపాటు తెలుగులోను విడుదలై మంచి విజయాలు సాధించాయి. దీంతో ఆయన తెలుగువారి మనసులలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా గతకొన్ని నెలలుగా హృతిక్ రోషన్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడా ఆ వార్త నిజమైంది. అందరూ ఊహించినట్లుగానే హృతిక్ రోషన్ రెండో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆమె ఎవరు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అనే వివరాలను తెలుసుకుందామా..

హీరో హృతిక్ రోషన్ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో 2014లో సుస్సన్నే ఖాన్ నుంచి హృతిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లకు డిన్నర్ డేటకు వెళ్తున్నారు. దీంతో ఈ జంట ఇటీవల కెమెరా కంట పడటంతో వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కాగా, తాజా సమాచారం ప్రకారం హృతిక్ – సబా త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్.. తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబా ఆజాద్‌ని పరిచయం చేయగా, వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందట. మాజీ సతీమణి సుస్సన్నేఖాన్ కూడా సబాతో సన్నిహితంగా ఉంటోందట. సమయం దొరికినప్పుడల్లా సబా.. హృతిక్ ఇంట్లో వాలుతుందోట. హృతిక్ కుటుంబంతో సబా కలిసి ఉన్న పలు ఫొటోలు సైతం ఇటీవల బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి.

మరోపక్క హృతిక్ రోషన్ అభిమానులంతా ఆయన కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు.హృతిక్ రోషన్ నటించే ప్రతి సినిమాలో ఆయన వేసే స్టెప్పులు యావత్ సినిమా ప్రియులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా హృతిక్ యాక్టింగ్ అంటే ఇష్టపడే అభిమానులు ఆయనకు ఎందరో ఉన్నారు. ఇటువంటి సమయంలో హృతిక్ రోషన్ రెండోవ పెళ్లికి సిద్ధమైనట్లు నిజం కావడం సంచలనంగా మారింది.