అదిరిపోయే స్టెప్స్..సమంత హాట్ లుక్స్…మంగ్లీ సిస్టర్ మ్యాజికల్ వాయిస్..టాలీవుడ్‌నే కాదు బాలీవుడ్‌ను ఓ రేంజ్లో షేక్ చేసింది ఊ అంటావా..ఊహూ అంటావా పాట. మామూలు సాంగ్‌నే అదరగొట్టే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్..ఈ స్పెషల్ సాంగ్‌లో తనదైన మెస్మరైజింగ్ మూమెంట్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన మొదటి మాస్ సాంగ్ ఇది. ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అయిన ఈ బ్యూటీ బోల్డ్ లుక్‌లో కనిపించి, పవర్ ఫుల్ మూమెంట్స్‌తో దుమ్ముదులిపేసింది. అప్పట్లో పుష్ప సినిమా రిలీజ్ కన్నా ముందే ఈ పాట్ సోషల్ మీడియాలో ఓ రికార్డును సృష్టింది. మూడు నిమిషాల ఈ పాట కోసం సమంతా ఏకంగా రూ.5 కోట్ల వరకు పారితోషకం తీసుకుందని రూమర్లు కూడా వచ్చాయి. ఆ మాట పక్కన పెడితే ఈ పాట విన్నప్పుడల్లా సమంతనే కనిపిస్తుందంటే ఆ పాటకు పాప ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలుస్తుంది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ హిట్ సాంగ్‌ను విదేశాల్లో ప్రదర్శించి క్రేజ్‌ను సంపాదించుకుందామనుకున్నారు , కానీ వారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ను చూసి దిమ్మతిరిగి బొమ్మకనిపిస్తోందని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఆ పాటేంటి మీరు చేసిన డ్యాన్సేంటి అంటూ తిట్టిపోస్తున్నారు.
View this post on Instagram
యూఎస్ డల్లాస్‌లో ఓ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, హాట్ బ్యూటీ, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం వీరు సమంత హిట్ సాంగ్ ఊ అంటావా..ఊహూ అంటావా పాటను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పాటను తమదైన స్టైల్లో పెర్ఫార్మ్ చేశారు వీరిద్దరూ. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే చాలా మంది నెటిజన్లకు వీరి డ్యాన్స్ ఏమాత్రం నచ్చలేదు. హిట్ పాటను నాశనం చేశారు కదరా అంటూ కామెంట్ బాక్స్‌లో హీరో హీరోయిన్లను ఏకిపారేశారు. మీరు సామ్‌ను, అల్లుఅర్జున్ను ఏమాత్రం బీట్ చేయలేరని వారి దరిదాపుల్లోకి కూడా రాలేరని కొంత మంది కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత నీచంగా డ్యాన్స్ చేస్తున్నారు ఏంట్రా దేవుడా అని కొంత మంది తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరు డ్యాన్స్ వరకు వెళ్లకండి అక్షయ్ కుమార్ ఎక్స్ప్రెషన్స్ చాలు వారి పెర్ఫార్మెన్స్ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి అంటూ చివాట్లు పెట్టారు.