‘Bollywood-style’ chase caught on camera as police nab drug peddlers in Ferozepur
mictv telugu

సినిమా స్టైల్‌లో డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు.. వీడియో

August 9, 2022

ముందు డ్రగ్ పెడ్లర్స్ కారు.. ఆ వెనుకనే వెంబడిస్తూ పోలీసుల బ్లాక్ జీప్.. అడ్డొచ్చిన వాహానాలను, మనుషులను గుద్దుకుంటూ వెళ్తున్న ఆ కారును పోలీసులు చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అచ్చం సినీ ఫక్కీలో పంజాబ్ పోలీసులు ఈ డ్రగ్స్ ముఠాను పట్టుకొని, వారి నుంచి 10 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో జరిగింది. ఛేజింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో లాగా చేజింగ్ వీడియోలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

ఫిరోజ్ పూర్ లోని చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఆ సమయంలో పోలీసులను చూసి ఆగకుండా వైట్ కలర్ డిజైర్ కారు ముందుకు వెళ్లింది. ఆ కారుని మరో కారుతో పోలీసులు చేజ్ చేశారు. ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ స్కూటీ, బైక్ ని ఢీకొనడంతో… మహిళతో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. జంక్షన్ దగ్గర మరో కారులో నుంచి పోలీస్ దిగి నిందితులను గన్ తో బెదిరించారు. ఆకారులో వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీస్ పరిగెత్తడం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అ యినప్పటికీ ఆగకపోవడంతో.. టైర్లపై కాల్పులు జరిపారు. అయినా ఆగకుండా కారులో పరారయ్యారు నిందితులు. చివరికి దుండుగుడు దొరకడంతో కారులో తనిఖీలు చేసిన పోలీసులు పది గ్రాముల హెరాయిన్ ని పట్టుకున్నారు. కారులో వ్యక్తులను పట్టుకున్నామని..అయితే వారి కోసం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.