Bollywood Tv Actor Siddhaanth Vir Passed Away While Working Out At Gym
mictv telugu

తీవ్ర విషాదం.. గుండెపోటుతో హీరో సిద్ధాంత్ మృతి

November 11, 2022

Bollywood Tv Actor Siddhaanth Vir Passed Away While Working Out At Gym

చావు ఎప్పుడు ఎవర్ని ఎలా తీసుకెళ్తుందో చెప్పలేం. గంట ముందు మనతో వ్యక్తి అనూహ్యంగా తనువుచాలించొచ్చు. ఈ యాంత్రిక జీవితంలో అయితే హార్ట్ అటాక్స్ మరీ కామన్ అయిపోయాయి. వయసుకి, ఫిట్నెస్ కి సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి. చూడడానికి ఫిట్ గా కనిపించే బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్ల అవ్వొచ్చు, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కావొచ్చు వర్కౌట్స్ చేస్తూనే గుండెపోటుకు గురయ్యారు. అయితే తాజాగా ఇలాంటి విషాదం జరిగింది. మరో బాలీవుడ్ స్టార్ నేడు గుండెపోటుతో చనిపోయారు. హిందీలో బాగా ఫెమస్ అయిన టెలివిజన్ నటుడు, సిద్ధాంత్ వీర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ హార్ట్ అటాక్ తో మరణించాడు.

బాలీవుడ్ లో ఇతన్ని ప్రేమగా SV అని పిలుస్తారు. క్కుసుమ్ అనే షోతో టెలివిజన్ కి అరంగేట్రం చేసాడు సిద్ధాంత్. ఆ తరువాత చాలా షోలలో లీడ్ గా కనిపించాడు. సిద్ధాంత్ 2017లో సూపర్ మోడల్ అలెసియా రౌత్‌ను వివాహం చేసుకున్న సిద్ధాంత్ మరణంతో బాలీవుడ్ టెలివిజన్ రంగం ఒక్కసారిగా షాక్ కి గురైంది. సిద్ధాంత్ సన్నిహితులలో ఒకరైన నటుడు సలీల్ అంకోలా తన సోషల్ మీడియా ఈ వార్తను పంచుకున్నారు. నెటిజన్స్ అంతా సిద్ధాంత్ కి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక బాలీవుడ్ టీవీ సీరియల్స్ కృష్ణ అర్జున్, కయామత్ సహా అనేక టెలివిజన్ సిరీస్ లలో హీరోగా మెప్పించి మోస్ట్ హ్యాండ్ సమ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధాంత్.