దాదాతో స్టెప్పులేసిన అతిలోకసుందరి..! - MicTv.in - Telugu News
mictv telugu

దాదాతో స్టెప్పులేసిన అతిలోకసుందరి..!

June 30, 2017

శ్రీదేవి ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా.. మంచి నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది,ఇప్పుడు సెలెక్టెడ్ పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది,ఈమద్య వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో అందరి మన్నలలు పొందింది,తాజాగా మామ్ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే మామ్ చిత్ర ప్రచారంకోసం ఈమద్య శ్రీదేవి కలకత్తా వెళ్లారట,అక్కడ సౌరవ్ గంగూళీ చేస్తున్న”దాదాగిరి” అనే షోలో పాల్గొందట,ఇగ అతిలోక సుందరి వస్తుందని సెట్ లో మొత్తం సందడి వాతావారణం నెలకొందట,తన హిట్ చిత్రాలలోని కొన్ని పాటలమీద గంగూలీతో కలిసి శ్రీదేవి డ్యాన్స్ చేసినట్టు సమాచారం,టీవీలో ఆ షో ప్రసారమైతే గానీ అటు గంగూళీ ఫ్యాన్స్ కు ఇటు శ్రీదేవీ ఫ్యాన్స్ కు..వాళ్ళిద్దరి ఫర్ఫామెన్స్ చూసే ఛాన్స్ లేదన్నమాట.