సినిమాలో రాం దేవ్ బాబా... - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలో రాం దేవ్ బాబా…

August 10, 2017

యోగా గురువు బాబా రాం దేవ్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. బాబా ఏంటి సినిమాలో నటించడం ఏంటి అనుకుంటున్నారా.? అవును నిజమే యే హై ఇండియా సినిమాలో కనిపించనున్నారట. అంతేకాక ఈ మూవీని కూడా ప్రమోట్ చేయనున్నారట.సయ్యన్ సయ్యన్ అనే సాంగ్ లో కనిపించనున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలిసింది. లామ్ హర్ష డైరెక్షన్ లో యే హై ఇండియా సినిమా రానుంది. కొందరికి మనదేశం గురించి తెలియదని, మన దేశ గొప్పతనాని ఈ చిత్రంలో చూపించారని బాబా రాం దేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచాన్ని పాలించే సామర్థ్యం భారత్ కు ఉందని, అలాంటి సన్నివేశాలను సినిమాలో చూపించారని. మంచి సినిమా కాబట్టి సపోర్ట్ చేస్తున్నట్టు బాబా తెలిపారు. ఆగస్టు 18న యే హై ఇండియా సినిమా విడుదల కానుంది.