Bomb attack on RSS office in Kerala
mictv telugu

కేరళలో ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి.. తీవ్ర ఉద్రిక్తత

July 12, 2022

Bomb attack on RSS office in Kerala

కేరళలోని కన్నూరు జిల్లా పయ్యన్నూరులో ఉన్న ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై మంగళవారం తెల్లవారు ఝామున దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీంతో భవనంలోని అద్దాలు పగిలి, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆఫీసులో ఉన్నా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా, పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు.

ఈ ఘనటకు సంబంధించిన దృష్యాలు అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. అంతకు ముందు ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి ఆఫీసును ఫోనులో స్కానింగ్ చేసినట్టు గుర్తించారు. ఆఫీసు రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉండడంతో బాంబు శబ్దం వినగానే స్థానికులు బయటికి వచ్చారు. పోలీసు స్టేషను దూరంగా ఉండడంతో పోలీసులు రావడం కొంత ఆలస్యమైంది. తర్వాత ఆఫీసుకు భద్రత పెంచినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ పని సీపీఎం కార్యకర్తలే చేసి ఉంటారని, దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరిదాసన్ ఆరోపించారు. బంగారం స్కాంలో చిక్కకున్న సీఎం పినరయి విజయన్‌ నుంచి దృష్టి మరల్చడానికి ఈ చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.