కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద బాంబు పేలుడు… - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద బాంబు పేలుడు…

May 19, 2019

Bomb Blast At congress Party MLA Munirathna Home Near In Bangalore Karnataka.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నివాసం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర బెంగళూరులో ఆదివారం చోటు చేసుకుంది.

రాజరాజేశ్వరి‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఆదివారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న వెంకటేశ్(45) అనే వ్యక్తి మృతి చెందాడు. పేలుడు విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కాగా భూమిలో అమర్చిన మందుగుండును పేల్చడంతో ఈ ప్రమాదం జరిగిందని, పేలుడు కారణంగా భూమిపై గొయ్యి ఏర్పడిందని పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్.. తనిఖీలు చేస్తోంది. అయితే ఎవరిని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.