హైదరాబాద్‌లో బాంబు పేలుడు..ఒకరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో బాంబు పేలుడు..ఒకరి మృతి

September 8, 2019

hyderabad.

హైదరాబాద్‌లో బాంబు పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే 279 పిల్లర్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉన్న ఓ పాలిథిన్ కవర్‌ను తెరుస్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనాస్థలిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.  పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ద్వారా మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. మృతుడిని రాజేంద్రనగర్ కు చెందిన అలీగా గుర్తించారు.