లండన్ మెట్రో రైళ్లో పేలుడు...! - MicTv.in - Telugu News
mictv telugu

లండన్ మెట్రో రైళ్లో పేలుడు…!

September 15, 2017

అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైల్‌లో పేలుడు జరగడంతో లండన్‌ నగరం ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం పశ్చిమ లండన్‌ పార్‌సన్స్‌ గ్రీన్‌ ట్యూబ్‌ స్టేషన్‌ వద్ద మెట్రోరైల్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. పేలుడుతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇది ఉగ్రవాద దాడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగానే పరిగణిస్తున్నామని, ఈ ఏడాది బ్రిటన్‌లో పలు ఉగ్రవాద దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఉగ్రకోణంలోనే దర్యాప్తు చేపడుతున్నామని లండన్‌ పోలీసులు స్పష్టం చేశారు.

ట్యాబ్‌ ట్రెయిన్‌లో గుర్తు తెలియని వ్యక్తి వదిలిన బ్యాగ్ పేలిపోవటంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు సమచారం తెలుసుకున్న భద్రతా దళాలు, బాంబ్‌ స్క్వాడ్‌, సహాయక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ మార్గంలో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.