Bomb Blast In Quetta Pakistan Ongoing match between Babar Azam And Sarfaraz Ahmed teams
mictv telugu

మరోసారి పాక్‎లో బాంబు పేలుడు.. క్రికెటర్స్ సేఫ్

February 5, 2023

Bomb Blast In Quetta Pakistan Ongoing match between Babar Azam And Sarfaraz Ahmed teams

బాంబు పేళుళ్లతో పాకిస్థాన్ దద్దరిల్లిపోతుంది. ఒక పక్క ఆర్థిక మాంధ్యం వెంటాడుతుంటే మరో పక్క బాంబు పేళుళ్ళు దాయాది దేశాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదు రోజుల కిందట పెషావర్ లోని మసీదులో తాలిబన్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో.. 100 మందికి పైగా చనిపోయిన ఘటనల మరువక ముందే మరోసారి ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ సారి క్వెట్టా నగరంలోని మూసా చౌక్‌లో బాంబు పేలింది. అయితే ఈ ఘటనలో ఇప్పటి ఎవరూచనిపోయినట్టు సమాచారం అందలేదు. కేవలం ఐదుగురు మాత్రమే గాయపడినట్టు తెలుస్తోంది.

ఇక ఈ బాంబు పేలుడు ఎఫెక్ట్ క్వెట్టా వేదికగా జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ పై పడింది. బాబర్‌ అజామ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు బాంబు పేలుడు తర్వాత మైదానంలోకి రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పు కూడా అంటించారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుత వైరల్ అవుతున్నాయి. అయితే బాంబు పేలుడు కారణంగా ఆటగాళ్లకు ఎలాంటి హాని జరగలేదు. ఈ మ్యాచ్ కోసం 13000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మ్యాచ్‌ కోసం 4000 మందికి పైగా భద్రతా సిబ్బందిని నియమించారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు షాహిద్ అఫ్రిది, మొయిన్ ఖాన్, జావేద్ మియాందాద్ తదితర ప్రముఖులు కూడా క్వెట్టా చేరుకున్నారు.