వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ , అమితాబ్ బచ్చన్ ల ఇళ్లను పేల్చేస్తామంటూ ముంబై పోలీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ కుర్లాలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
పది నిమిషాల్లో కుర్లాలో పేలుడు జరుగుతుంది చెప్పి వ్యక్తి కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసాడు. దీంతో పోలీసులు స్క్వాడ్ లు , బీడీడీఎస్ సిబ్బంది హుటాహుటిన కుర్లాకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసే పనిలో మునిగిపోయారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, ఇల్లు యాంటిలియా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సినీ నటుడు ధర్మేంద్ర తదితరుల ఇళ్లలో బాంబు పేలుళ్లు జరుగుతాయని నాగ్‌పూర్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ముంబయిలోని దాదర్‌లో ఉగ్రదాడి చేసేందుకు 25 మంది ఉగ్రవాదులు వచ్చినట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ఇదే విధంగా ఫిబ్రవరి 25న, ముంబై పోలీసుల సౌత్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేసి, జెజె హాస్పిటల్, భెండీ బజార్, నల్ బజార్ సెక్టార్లలో బాంబు పేలుళ్లు చేస్తామని హెచ్చరించిన వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేసి తొమ్మిది గంటల్లో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇదే విధంగా ఈ బాంబు బెదిరింపులకు పాల్పడిని వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులుు తనిఖీలను నిర్వహిస్తున్నారు.