బాలీవుడ్ నటి సన్నీలియోన్ పాల్గొననున్న ఫ్యాషన్ షో వేదికకు సమీపంలో బాంబు పేలుడు జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో ఘటన చోటుచేసుకుంది. మణిపూర్, ఖాదీ చేనేత వస్త్రాలతో పాటు రాష్ట్ర పర్యాటకంపై విస్తృత ప్రచారం చేపడుతోంది. దీనిలో భాగంగా హౌజ్ ఆఫ్ అలీ అనే సంస్థ ఓ ఫ్యాషన్ షో ఇంఫాల్ లోని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆదివారం సన్నీలియోన్ కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి.
ఇక శనివారం తెల్లవారు జామున 6:30 గంటలకు ఈ వేదికకు కేవలం 100 మీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించక పోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.ఐఈడీ పేలిందా లేక గ్రానైడా అన్నది తెలియాల్సి ఉంది . పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు మిలిటెంట్ సంస్థలు ప్రకటించలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు వెనకు ఎవరు ఉన్నారని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. హట్టా కంజిబుంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.