విశాఖ - సికింద్రాబాద్ రైళ్ల‌లో బాంబుల కాల్.. తనిఖీలు - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ – సికింద్రాబాద్ రైళ్ల‌లో బాంబుల కాల్.. తనిఖీలు

April 13, 2022

8

ఓ అజ్ఞాత‌ వ్య‌క్తి పోలీసులకు ఫోన్ చేసి షాక్ ఇచ్చాడు. విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబులు పెట్టామని 100కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే రైళ్లను ఆపి, తనిఖీలు చేయటం మొదలుపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే రైళ్ల‌లో బాంబులు పెట్టినట్లు ఓ అజ్ఞాత‌ వ్య‌క్తి 100 నంబ‌రుకు ఫోన్ చేశాడు. అత‌డి ఫోన్ కాల్‌తో రైల్వే రక్షక దళం, రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యి, కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశాం. ప్ర‌స్తుతం ఆ రైలులో తనిఖీలు చేస్తున్నాం. అంతేకాదు, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి అందులోనూ తనిఖీలు చేస్తున్నాం. రైలు బోగీల్లో అనుమానాస్పద వస్తువులనూ త‌న‌ఖీలు చేస్తున్నాం. ఆ ఫోన్ కాల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? కేవ‌లం బెదిరింపు కోస‌మే ఆ అజ్ఞాత వ్య‌క్తి ఈ ఫోన్ చేశాడా? అన్న అంశాల‌పై కూడా ఆరా తీస్తున్నాం” అని అన్నారు.