‘సౌతిండియా షాపింగ్ మాల్‌’కు బాంబు బెదిరింపు - MicTv.in - Telugu News
mictv telugu

‘సౌతిండియా షాపింగ్ మాల్‌’కు బాంబు బెదిరింపు

May 16, 2022

ప్రముఖ వస్త్ర షోరూంలు అయిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మాంగళ్య, వీఆర్‌కే సిల్క్స్‌లకు సోమవారం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కరీంనగర్‌లో ఉన్న ఈ మూడు షోరూంలలో బాంబులు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

డాగ్ స్క్వాడ్‌తో రెండు గంటల పాటు మూడు సంస్థలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, చివరికి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని నెంబరు ఆధారంగా పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, బాంబు లేదని తేలడంతో అప్పటివరకు టెన్షన్‌గా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.