Bomb Threatening call to ballari express Secunderabad.
mictv telugu

బళ్లారి ఎక్స్‎ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఫోన్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‎లో అలజడి

February 23, 2023

Bomb Threatening call to ballari express Secunderabad. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో మరోసారి బాంబు కలకలం రేగింది. స్టేషన్ లో ఆగి ఉన్న బళ్లారి ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు డాగ్ స్క్వాడ్ తో చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైలు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. కంట్రోల్ రూంకు వచ్చింది ఫేక్ కాల్‎గా గుర్తించిన అధికారులు..దానిపై విచారణ చేపట్టారు. ఫోన్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క సారిగా పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణీకులు ఏమి జరుగుతుందో అర్ధం కాక కాసేపు ఆందోళనకు గురైయ్యారు.

 

ఇటీవల కాలంలో విమానాలకు, రైళ్లకు ఫేక్స్ కాల్స్ బెడద ఎక్కువైంది. ఏది అసలు కాల్‎లో, ఏది ఫేక్ కాల్‎లో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. కాల్ రాగానే సంబంధింత రైలు, విమానాలను నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు. ఫేక్ కాల్స్ తో పోలీసులు, ప్రయాణికులు ఇబ్బందు ఎదుర్కోవల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో కూడా చెన్నై వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి ఫేక్ కాల్ చేశాడు. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చిన ఓ ప్రయాణీకుడిని లోపలకు అనుమతించకపోవడంతో ఆ ఫ్లైట్ లో బాంబు ఉందంటూ బెదరింపు కాల్ చేశాడు. దీంతో అధికారులు పరుగులు పెట్టి తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఫేక్ కాల్‎గా తేలింది.