Bombay High Court said bail will be canceled if they do not get married within a year
mictv telugu

అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే బెయిల్ రద్దు

October 17, 2022

Bombay High Court said bail will be canceled if they do not get married within a year

అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. బాధిత మహిళను ఏడాదిలోపు వివాహం చేసుకోకుంటే ఇచ్చిన బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. అయితే బాధిత యువతి కనిపించకుండా పోవడం గమనార్హం. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకెళితే.. నిందితుడు, బాధిత యువతి (22) 2018 నుంచి లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. వీరి విషయం ఇద్దరి ఇళ్లలో కూడా తెలుసు. ఈ క్రమంలో 2019లో యువతి గర్భం దాల్చింది.

ఈ విషయం నిందితుడికి తెలిసి మొఖం చాటేశాడు. ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 2020 జనవరి నెలలో బాధిత యువతి ప్రసవించగా, తర్వాత ప్రియుడిపై అత్యాచారం, మోసం చేశాడని కేసు పెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, పుట్టిన బిడ్డకు తండ్రిని తానేనని స్పష్టం చేశాడు. దీంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా, ఏడాదిలోగా యువతిని పెళ్లి చేసుకోకుంటే బెయిల్ రద్దవుతుందని తీర్పునిచ్చింది. అయితే బాధిత యువతి జనవరి 30న పుట్టిన పసిబిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఆ బిడ్డను వేరేవాళ్లు దత్తత కూడా తీసుకున్నారు. దీంతో పోలీసులు యువతిపై కేసు నమోదు చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే బాధిత యువతి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. మరి వీరి పెళ్లి జరుగుతుందా లేక నిందితుడికి జైలు శిక్ష పడుతుందా అనేది ఏడాది వరకు తేలనుంది.