రూ. 5 కోట్ల కేసులో ప్రకాశ్‌రాజ్‌కు హైకోర్టు నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 5 కోట్ల కేసులో ప్రకాశ్‌రాజ్‌కు హైకోర్టు నోటీస్

February 28, 2020

hvh n

బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రకాశ్‌రాజ్‌ నడిగర్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ చిత్రానికి రీమేక్‌‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఆ ఫైనాన్సియర్‌కు ఆయన చెక్కును ఇచ్చారు. అది బ్యాంకులో బౌన్స్‌ అవడంతో ఆ ఫైనాన్సియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను  విచారించిన న్యాయమూర్తి  ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌కు నోటీసులు పంపింది.  

కాగా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించి  మంచి నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్‌రాజ్‌.. దర్శకత్వం కూడా వహించారు. నిర్మాతగా మారి తమిళంలో ధోని, ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.