Bonala Festival .. Minister Talasani Srinivas Yadav Theennmar steps at the opening ceremony
mictv telugu

తీన్‌మార్ స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి తలసాని.. నెక్స్ట్ లెవల్

July 15, 2022

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తీన్ మార్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా.. ముఖ ద్వారాల ప్రారంభోత్స‌వ వేడుక‌లో మంత్రి త‌ల‌సాని స్టెప్పులు వేసి అక్క‌డున్న వారిలో ఉత్తేజాన్ని నింపారు. మంత్రి త‌ల‌సాని డ్యాన్స్‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు బోనంతో బోనం సమర్పించారు. ఈ బోనాల పండుగ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున భ‌క్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల‌తో మ‌హిళ‌ల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను అల‌రించాయి. ఈ వేడుక‌లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ప‌లు కార్పొరేష‌న్ల చైర్మన్‌లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు నాయ‌కులు పాల్గొన్నారు.