హైదారాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

హైదారాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్ 

July 18, 2020

bonalu festival hyderabad

మందుబాబులు జాగ్రత్త పడాలి. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.శనివారం, ఆదివారం వీటిని మూసేయాలని బల్దియా అధికారులు ఆదేశించారు. బోనాల జాతర సందర్భంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జంట నగరాల్లో దుకాణాలను తెరవకూడదని  కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే బోనాల పండగ చేసుకోవాలని ఇదివరకే అధికారులు సూచించారు. 

బోనాలకు నగరం పెట్టింది పేరు. ఏటా ఘనంగా చేసుకునే ఈ పండగ ఆసారి కరోనా వల్ల కళ తప్పింది. దీంతో ప్రధాన ఆలయాల్లో పూజారులతోను వేడుకు నిర్వహిస్తున్నారు. భక్తులను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత మొదట్లో వైన్ షాపుల వద్ద జనం భారీగా గుమికూడారు. తర్వాత అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.