తల్లీ బైలెల్లినాదో... 25 నుంచి బోనాల జాతర - MicTv.in - Telugu News
mictv telugu

తల్లీ బైలెల్లినాదో… 25 నుంచి బోనాల జాతర

June 5, 2017

హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి మొదలైంది. ఈ నెల 25 నుంచి గోల్కోండ బోనాల జాతర షురూ కానుంది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం లేదా మొదటి గురువారం బోనాల జాతర మొదలవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం జూన్ 25 ,గోల్కొండ బోనాల జాతర ప్రారంభమవుతుంది.జూలై 23న తొమ్మిదో బోనంతో జాతర ముగుస్తుంది. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లో కొలువుదీరిన శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జూలై 9, 10వ తేదీల్లో జరుగనున్నాయి. గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలతోపాటు పాతబస్తీ బోనాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ అధికారులు, అలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.