చేతిపంపు నుంచి నీటికి బదులు రక్తం..హడలిపోతున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

చేతిపంపు నుంచి నీటికి బదులు రక్తం..హడలిపోతున్న జనం

December 11, 2019

Uttar Pradesh02

నీటి కోసం చేతి పంపు దగ్గరకు వెళితే వింత సంఘటన చోటు చేసుకుంది. రక్తం, మాంసం ముద్దలు దారాగా వస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు.యూపీలోని హమీర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. దుర్వాసన కూడా విపరీతంగా వస్తుండటంతో చూసిన వారంతా ఇదేం వింత అని భయపడిపోతున్నారు. అటుగా వెళ్లేందుకే స్థానికులు హడలిపోతున్నారు. 

జాఖోడీ గ్రామంలో వంద ఇళ్ల కోసం తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం బోరు వేయించి దానికి హ్యాండ్ పంపు బిగించింది. కొంత కాలం భాగానే ఉన్నా ఇటీవలి కాలంలో ఆ హ్యాండ్ పంప్ నుంచి నీటికి బదులుగా రక్తమాంసాలు,ముక్కలు ముక్కులుగా బొక్కలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు ఏదో జరుగుతోందని భయపడిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్యను తీర్చాలని ఆదేశించారు.  హ్యాండ్ పంప్ లోపల పాము మృతిచెంది అధికారులు భావిస్తున్నారు. అటుగా ఎవరూ వెళ్లకుండా చేసి చేతి పంపును మూసివేశారు. దీనిపై మూఢ నమ్మకాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. లోపల ఏదైనా జీవి మరణించి ఉంటుందని..ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.