బుక్ మై షోలో 270 మందికి ఉద్వాసన
లాక్ డౌన్ ప్రభావంతో కంపెనీలన్ని నష్టాల్లో కూరుకుపోయాయి. సినీ పరిశ్రమ,థియేటర్లు కూడా మూతబడిపోయాయి. దీంతో సినిమాలకు అనుబంధం ఉన్న సంస్థల్లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆయా సంస్థలు బారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సంస్థ ‘బుక్ మై షో’కు కూడా ఎదురైంది. రెండు నెలలకు పైగా థియేటర్లు మూతబడిపోవడంతో ఆ సంస్థ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశాలు కూడా లేకపోవడంతో చర్యలు ప్రారంభించింది
నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉద్యోగులను మోయలేమని పేర్కొంది దీంట్లో భాగంగా 270 మందిని తొలగిస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో ఆశిష్ హేంరజని ప్రకటించారు. మెయిల్ ద్వాారా ఉద్యోగులకు ఓ సందేశం కూడా పంపారు. ప్రస్తుతం పరిస్థితిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించక తప్పడం లేదని వెల్లడించారు. దీంట్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పారు. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఆ సంస్థలో 1,450 మంది పని చేస్తున్నారు. తొలగించిన వారికి రెండు నెలల జీతాన్ని అదనంగా ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారితే వారిని తిరిగి తీసుకుంటామని ఆయన తెలిపారు.